Breaking News

Telangana: ఈ వారం వానలు అంతంతే..!

Published on Tue, 07/21/2026 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి సీజన్‌ రెండో మాసం కూడా వర్షాభావ పరిస్థితులే నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. సాధారణంగా జూన్‌లో పెద్దగా వర్షాలు కురవకున్నా జూలై రెండో వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వానలు ఊపందుకుంటాయి. కానీ ఈసారి నైరుతి సీజన్‌లో వానల నమోదు లోటులో ఉంది. ఎల్‌నినో పరిస్థితులున్నప్పటికీ జూన్, జూలై నెలల్లో వానలు సాధారణ స్థితిలో నమోదవుతాయని ఐంఎండీ ముందస్తు అంచనాల్లో ప్రకటించినప్పటికీ... వరుసగా రెండు నెలలు లోటు వర్షపాతమే నమోదైంది.

రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో 12శాతం లోటు వర్షపాతం నమోదు కాగా... ఈనెల 20 నాటికి 49 శాతం లోటు నమోదు కావడం... ఈ వారాంతం వరకు కూడా వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్న ప్రకటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 

సగటున 31 శాతం లోటు 
ఎల్‌నినో ప్రభావం మే నెల నుంచే ఉంది. మేలో ఒక్కరోజు కూడా చినుకు రాలలేదు. సాధారణంగా హైదరాబాద్‌ సమీప జిల్లాలతోపాటు వివిధ ప్రాంతాల్లో నైరుతి సీజన్‌కు ముందే అడపాదడపా వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మేలోనే కాకుండా జూన్‌ నెల మొత్తంగా అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్ర రూపం దాలి్చందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్‌లో 13.03 సెం.మీ. వర్షపాతానికిగాను 11.53 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 12శాతం లోటు నమోదైంది.

జూలైలో ఇప్పటివరకు 14.01 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 7.16 సెం.మీ. నమోదైంది. సాధారణం కంటే 49 శాతం లోటు నమోదైంది. నైరుతి సీజన్‌లో ఇప్పటివరకు 27.04 సెం.మీ. సగటు వర్షపాతానికి గాను 18.69 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం కంటే 31 శాతం లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. వానలు సాధారణం కంటే తక్కువగా కురవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనలో పడేసింది. వరి నాట్లు, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగుపై ఈ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పటికే విత్తనాలు వేసిన ప్రాంతాల్లో వానల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నిచోట్ల విత్తనాలు భూమిలోనే మాడిపోయాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వర్షాల కోసం ఎదురుచూస్తూ సాగు పనులను వాయిదా వేసుకున్నారు.

బలమైన ఉపరితల గాలులు


రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడ్డప్పటికీ... వానలు మాత్రం కురవడం లేదు. దట్టమైన వర్ష మేఘాలు ఏర్పడటం లేదు. ఎల్‌నినో ప్రభావంతోపాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో బలమైన అల్పపీడన వ్యవస్థలు ఏర్పడకపోవడంతో వానలు చాలా పరిమితంగానే కురుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మేఘాలు ఏర్పడుతున్నప్పటికీ... బలమైన ఉపరితల గాలుల ప్రభావంతో ఆయా మేఘాలు వేగంగా చెదిరిపోతున్నాయి. రాష్ట్రంపై దిగువ ట్రోపోస్ఫియర్‌లో వేగంగా వీస్తున్న ఉపరితల గాలులు తేమను నిలువనివ్వకపోవడం వల్ల ఉరుములు, భారీ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడటం లేదు. గత పక్షం రోజులుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. దట్టమైన మేఘాలు ఏర్పడిన ప్రాంతాల్లో వర్షం వస్తుందని భావించినా... ఆ పరిస్థితి నిమిషాల వ్యవధిలో మారిపోతోంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, రాష్ట్రంలో గణనీయమైన వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం ఏర్పడి తెలంగాణ వైపు కదలాలి. అలాంటి వ్యవస్థ ఏర్పడే వరకు నైరుతి రుతుపవనాలు బలపడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారంలో అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో లోటు వర్షపాతం కొనసాగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)