Breaking News

ఐర్లాండ్‌లో లీగల్‌గా పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు

Published on Wed, 08/06/2025 - 09:47

హైదరాబాద్‌: ఐర్లాండ్‌ దేశంలో విద్యకోసం వెళ్తున్న విద్యార్థులు ఆ దేశ నియమ నిబంధనల ప్రకారం లీగల్‌గానే పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఐర్లాండ్‌ దేశ ఎడ్యుకేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వెండి డిసౌజ అన్నారు. 

ఐ 20 ఫివర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ద్వారా ఐర్లాండ్‌లోని వివిధ యూనివర్సిటీలలో విద్యనభ్యసించేందుకు వెళ్తున్న విద్యార్థుల అవగాహన సదస్సు మంగళవారం జరగగా ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అక్కడి పరిస్థితులపై, పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కవడానికి రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉండేందుకు అక్కడి చట్టం అనుమతిస్తుందని తెలిపారు. 

ప్రతీయేటా తెలుగు రాష్ట్రాల నుంచి ఐర్లాండ్‌లో బిజినెస్‌ స్టడీస్, ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్, హెల్త్‌కేర్‌ రంగాల్లో చదువుకోవడానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్లిన్‌ సిటీ యూనివర్సిటీ, మేనూత్‌ టీయూఎస్‌ ఎన్‌సీఐ గ్రిఫిట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ గాల్వే ప్రతినిధులు హాజరయ్యారు. ఐ20 ఫివర్‌ సంస్థ ప్రతినిధులు నవీన్‌ యాతపు, శ్రీనివాస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు