Breaking News

యాసిడ్‌ ఫ్లైనా.. ‘లైట్‌’ తీస్కోండి!

Published on Sat, 01/11/2025 - 01:00

సాక్షి, హైదరాబాద్‌: అది అలాంటి ఇలాంటి దోమ కాదు.. కుడితే చర్మం ఎర్రగా మారిపోతుంది. భరించలేని మంట పుడుతుంది. అదే యాసిడ్‌ ఫ్లై దోమ. కందిరీగ మాదిరిగా ఉండే ఈ దోమను నైరోబీ ఫ్లై లేదా యాసిడ్‌ ఫ్లైగా జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్ధారించింది. ఇది కుడితే పెడెరస్‌ డెర్మటైటిస్‌ సమస్య ఏర్పడు తుంది. కుట్టిన చోట కా లిన గాయాల తరహాలో చర్మం మండుతుంది. కమిలిపోతుంది. ఈ దోమలతో నిత్యం ఇబ్బంది పడిన ఓ విద్యార్థి.. దానికి విరుగుడు కనుగొన్నాడు. తనతోపాటు తోటి విద్యార్థుల సమస్యను తీర్చాడు.  

సమస్య నుంచి ఆవిష్కారం 
హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో యాసిడ్‌ ఫ్లై దోమల సమస్య తీవ్రంగా ఉండేది. విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడేవారు. యాసిడ్‌ ఫ్లై బాధితుల్లో ఫిజిక్స్‌ గ్రాడ్యుయేట్‌ అయిన తేజస్‌ ఆంటో కన్నంపూజ కూడా ఉన్నాడు. అయితే ఇతర విద్యార్థులలాగా దోమ కరిచినప్పుడు బాధపడి తర్వాత ఆ విషయాన్ని వదిలేయలేదు. యాసిడ్‌ ఫ్లై దాడులను అరికట్టడానికి మార్గాలను అన్వేషించాడు. ఈ దోమల సంచారంపై అధ్యయనం చేశాడు. ఈ క్రమంలో యాసిడ్‌ ఫ్లై దోమలు హాస్టల్‌లో కొన్ని రూమ్స్‌లో మాత్రమే అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. అందుకు కారణాలను అన్వేషించగా.. అల్ట్రా వయలెట్‌ కిరణాలకు ఈ దోమ ఆకర్షింపబడుతోందని తేలింది.

 కాంపాక్ట్‌ ఫ్లోరోసెంట్‌ ల్యాంప్స్‌ (సీఎఫ్‌ఎల్‌) ట్యూబ్‌ లైట్లకు ఇవి బాగా ఆకర్షింపబడుతున్నాయని గుర్తించాడు. రేడియేషను అధికంగా విడుదల చేసే ఎల్‌ఈడీ లైట్లు ఉన్న గదుల్లోకి ఈ దోమలు అంతగా రావటంలేదని గమనించాడు. దీంతో స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు చెందిన డా.షమన్న ఆధ్వర్యంలో దీనిపై మరింత లోతుగా అధ్యయనం నిర్వహించి.. వర్సిటీకి నివేదిక సమర్పించాడు. తేజస్‌ పరిశోధన పెద్ద సమస్యను తీర్చిందని డాక్టర్‌ షమన్న సాక్షికి తెలిపారు. ఎక్కడైనా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేయటం ద్వారా యాసిడ్‌ ఫ్లై సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. వర్సిటీ హాస్టల్‌లో యాసిడ్‌ ఫ్లై సమస్య గతంలో 38 శాతం ఉండగా.. లైట్ల మార్పుతో 8 శాతానికి తగ్గిందని చెప్పారు.  

బాధకు పరిష్కారం వెతికాను
కొంతకాలంగా హాస్టల్‌ రూమ్స్‌లో యాసిడ్‌ ఫ్లై బాధను అనుభవించాం. పరిష్కారం కోసం అన్వే షించడంలో తప్పులేదుగా అనుకున్నా. మొత్తానికి సమస్యకు మూలం గుర్తించడంతో పరిష్కారం కూడా దొరికింది.  – తేజస్, హైదరాబాద్‌ వర్సిటీ విద్యార్థి 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)