Breaking News

మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్‌’! మొదటి ‘టీ’ ఏటీఏం..

Published on Sun, 10/08/2023 - 13:23

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్‌ ఎల్‌పీటీ మార్కెట్‌ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్‌ ఓపెన్‌క్యూబ్‌ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్‌ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు.

ఈ సందర్భంగా జెమ్‌ ఓపెన్‌క్యూబ్‌ సీఈఓ పి.వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్‌లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం  కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్‌ టీ, బాదం పాలు, బిస్కెట్‌లతో సహా మంచి నీటి బాటిల్‌లను అందించే ‘డిజిటల్‌ చాయ్‌’ లేదా ‘చాయ్‌ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్‌లోకి విడుదల చేశామన్నారు.  జెమ్‌ ఓపెన్‌క్యూబ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటేష్‌ యాదవ్, ప్రకాష్‌ వేలుపుల, త్రిలోచన్‌ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)