Breaking News

ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో బిగ్‌ ట్విస్ట్‌!

Published on Mon, 07/20/2026 - 18:40

సాక్షి,హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం.ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, ఆత్మహత్యాయత్నానికి ముందు ట్రైనీ ఐపీఎస్‌ రాసిన సూసైడ్ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి తనపై చేసిన లైంగిక వేధింపులు పూర్తిగా అవాస్తవమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

తాను సదరు బ్యాచ్‌మేట్ (కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్)తో గత ఏడాది కాలంగా రిలేషన్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా తమ ఇద్దరి మధ్య ఈ బంధం కొనసాగిందని వెల్లడించారు. ఈ క్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిణే స్వయంగా తన గది వద్దకు వచ్చి తలుపు తీయమని గొడవ చేసిందని, దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు తన మొబైల్ ఫోన్‌లో ఉన్నాయని వివరించారు.

వారి మధ్య ఉన్న రిలేషన్, వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను మహిళా ట్రైనీ ఐపీఎస్ భర్తకు కూడా వివరించినట్లు పేర్కొన్నారు. ఈ సంభాషణలు, చాటింగ్‌లు, వీడియోల తాలూకు అన్ని రకాల నిరూపణలు తన ఫోన్‌లోనే భద్రంగా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని లేఖలో వెల్లడించారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసును సరికొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)