Breaking News

సిబిల్‌పై కౌంటర్‌కు ఇదే లాస్ట్‌ చాన్స్‌

Published on Thu, 01/29/2026 - 04:34

సాక్షి, హైదరాబాద్‌: సిబిల్‌ స్కోర్‌ నివేదికలో ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణ చర్యలు చేపట్టేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేయడానికి ఇదే చివరి అవకాశమని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణలోగా కౌంటర్‌ దాఖలు చేయకుంటే జరిమానా విధించాల్సి వస్తుందని తేల్చిచెప్పింది. 

క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీల సవరణ నిబంధనలకు సంబంధించి 2021, నవంబర్‌ 29న ఆర్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే విధించాలని కోరు తూ హైదరాబాద్‌కు చెందిన కృపాసోని హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం బుధ వారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సిబిల్‌’పై పారదర్శక, స్వతంత్ర యంత్రాంగం రూపొందించే వరకు క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ సేవా కంపెనీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, సిబిల్‌ రూపంలో ప్రచురించి, వ్యాప్తి చేయకుండా నిరోధించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై ప్రతివాదుల తీరును తప్పుబట్టింది.   ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలై ఐదేళ్లు కావొస్తున్నా కౌంటర్‌ వేయకపోవడం సరికాదంటూ తదుపరి విచారణ మార్చి 17కు వాయిదా వేసింది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)