Breaking News

ధరణిపై దండుగా కదలాలి 

Published on Sun, 01/22/2023 - 01:48

చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అన్ని రాజకీయపార్టీలు, రైతులు దండుగా కదిలి పోరాడాలని భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్‌ పిలుపునిచ్చారు. తెలంగాణలో భూములు రీ సర్వే చేస్తేనే ధరణి, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో శనివారం లీగల్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మర్స్‌ సొసైటీ (లీఫ్స్‌), గ్రామీణ న్యాయపీఠం సంస్థ, తెలంగాణ సోషల్‌మీడియా ఫోరం, తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించారు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి గ్రామస్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కలెక్టరేట్‌ వరకు తీసుకుపోయిందని ఆరోపించారు.

ధరణి పోర్టల్‌ సమస్యలపై త్వరలో గవర్నర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మాసపత్రిక సంపాదకులు వి.లచ్చిరెడ్డి, సోషల్‌ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, కిసాన్‌సెల్‌ నాయకులు కోదండరెడ్డి, బీజేపీ నేత కొండావిశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)