Breaking News

Secunderabad: తొమ్మిది రోజుల తరువాత.. లలిత అంత్యక్రియలు

Published on Sun, 02/02/2025 - 13:26

బౌద్ధనగర్‌ (హైదరాబాద్‌): మరణించిన తర్వాత 9 రోజులపాటు ఇంట్లోనే ఉంచిన లలిత మృతదేహానికి శనివారం కూతుళ్లు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన బౌద్ధనగర్‌లోని ఇంట్లో లలిత చనిపోగా కూతుళ్లు ఆమె చనిపోయిన విషయాన్ని తొమ్మిదిరోజులపాటు బయటి ప్రపంచానికి చెప్పకపోవడం తెలిసిందే. అయితే ఆమె మృతదేహాన్ని వారాసిగూడ పోలీసులు గాంధీ మార్చురీకి తరలించి శనివారం పోస్టుమార్టం పూర్తి చేయించారు. అనంతరం లలిత సోదరుడు రమేశ్, కూతుళ్లు రవళిక,  యశ్వితలకు ఇన్‌స్పెక్టర్‌ రాచకొండ సైదులు మృతదేహాన్ని అప్పగించారు. బంధువుల సమక్షంలో మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.  

తామూ చనిపోవాలనుకుని... 
తండ్రి ఎటో వెళ్లిపోవడం, బంధువులు పట్టించుకోకపోవడంతో పాటు తల్లి కూడా మరణించడంతో ఇద్దరు కూతుళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో తాము కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి గొంతు, చేతులు కత్తితో కోసుకున్నారు. అటు తర్వాత ధైర్యం చాలక ఆత్మహత్యాయత్నం విరమించుకున్నారు. తీవ్ర మైన డిప్రెషన్‌లో ఉండటంతో తమకు ఏమీ గుర్తు లేదని పోలీసులకు తెలిపారు. తమపై కొంతమంది బ్లాక్‌ మ్యాజిక్‌ చేసి చంపాలని చూస్తున్నారని నోట్‌లో పేర్కొనడంతో వీళ్ల మానసిక స్థితి కూడా సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు.    

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)