Breaking News

ప్రేమ పేరుతో ‘కోచ్‌’ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య

Published on Fri, 10/10/2025 - 08:58

సాక్షి, అడ్డగుట్ట: ప్రేమ పేరుతో కోచ్‌ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రఘు బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటున్న ప్రమోద్‌కుమార్‌ రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

వారి పెద్ద కుమార్తె మౌలిక(19) అలియాస్‌ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఏ సెకండ్‌ ఇయర్‌ చదువుతుంది. అదే కాలేజీలో మాణికేశ్వర్‌ నగర్‌కు చెందిన అంబాజీ అనే యువకుడు కొన్ని నెలల క్రితం వాలీబాల్‌ కోచ్‌గా జాయిన్‌ అయ్యాడు. కొద్ది రోజులుగా అతను మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన మౌలిక బుధవారం సాయంత్రం  ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు 
పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి సెల్‌ఫోన్‌లో డేటా పూర్తిగా డిలీట్‌ చేసి ఉందని, డేటాను రిట్రీవ్‌ చేస్తున్నట్లు  చెప్పారు. అంబాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)