హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని

Published on Sun, 07/16/2023 - 11:08

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయని,  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.

‘‘రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించింది. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయాన్ని చాటి చెప్పారు. కుల మతాలకు అతీతంగా ఐక్యత తో బోనాల ఉత్సవాలు చేసుకోవాలి. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నా’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.
చదవండి: నేడు,రేపు పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు

మాజీ క్రికెటర్‌ మిథాలిరాజ్‌, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్.. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు.

పాతబస్తీతో సిటీ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్‌ మేళాలు.. పోతరాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. భక్తుల భావోద్వేగాల మధ్య బోనాల జాతర ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకుంటున్నాయి. గత నెల 22న గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించిన బోనంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఇందులో భాగంగా ఈ నెల 7న పాతబస్తీలోని చారిత్రాత్మక పురాతన దేవాలయాల అమ్మవార్లకు కలశ స్థాపన, అభిషేకం, అలంకరణ, నైవేద్యం, తీర్థ ప్రసాదాలతో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9న అమ్మవారి ఘటస్థాపన సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఘటస్థాపన అనంతరం వరుసగా ప్రతిరోజూ పూజలు నిర్వహించిన భక్తులు.. ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు.  సోమవారం పాతబస్తీ ప్రధాన వీధుల్లో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా జరగనుంది.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)