Breaking News

కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్‌!

Published on Wed, 04/02/2025 - 08:11

సాక్షి, హైదరాబాద్‌: కొత్త మెట్రో రైళ్లకు నిధుల కొరత బ్రేకులు వేస్తోంది. నగరంలోని వివిధ కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ మేరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో నాగ్‌పూర్‌ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. అనంతరం సొంతంగా కొనుగోలు చేసేందుకు సైతం ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైల్‌  సన్నాహాలు చేసింది. 

ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా మెట్రోరైళ్లను తయారు చేస్తోన్న భారత్‌ ఎర్త్‌మూవర్స్‌ లిమిటెడ్‌ సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు ఇప్పుడు నిధుల కొరత అతి పెద్ద సవాల్‌గా మారింది. గత పదేళ్లలో మెట్రో నష్టాలు సుమారు రూ.6500 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజు ఒకవైపు ప్రయాణికుల అవసరాలకనుగుణంగా రైళ్లను నడుపుతూనే మరోవైపు అదనపు నిధులను కేటాయించి కొత్త రైళ్లను కొనుగోలు చేయడం కొంత కష్టంగానే మారినట్లు అధికారులు చెబుతున్నారు.

ఏటేటా నష్టాలే... 
నగరంలో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి వరుసగా నష్టాలు నమోదవుతున్నాయి. రైళ్ల నిర్వహణలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోల్‌ నుంచి రాయదుర్గం, ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ కారిడార్‌లలో ప్రతిరోజు 57 రైళ్లు సుమారు 1050 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రోలు  అందుబాటులో ఉండేవిధంగా వేళలను కూడా పొడిగించారు.

 రోజుకు 5 లక్షల మందికి పైగా  ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కలి్పంచేందుకు అదనపు ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడం, డిజిటల్‌ సేవల విస్తరణ, లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ పెంపు, తదితర సేవలపైన ఎల్‌అండ్‌టీ దృష్టి సారించింది. ప్రస్తుతం 2 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.10 నుంచి గరిష్టంగా 26 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.60 చొప్పున చార్జీలు అమలవుతున్నాయి. అయినప్పటికీ గత పదేళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్‌ల ద్వారా వచ్చే ఆదాయం నష్టాలను ఏ మాత్రం భర్తీ చేయలేదు. పైగా ఏటేటా నష్టాలే నమోదై ఇప్పుడు రూ.6500 కోట్లకు చేరాయి.  

చార్జీల పెంపు అనివార్యమా... 
ఈ పరిస్థితుల్లో నగరంలో మెట్రోరైళ్ల నిర్వహణకు టిక్కెట్‌ చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారవర్గాల అంచనా. ‘2017 నుంచి ఇప్పటి వరకు చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఒకటి, రెండు సార్లు చార్జీలను సవరించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు కలి ్పంచేందుకు చార్జీల పెంపు  కొంత ఊరటనివ్వగలదని భావిస్తున్నాం.’ అని ఓ అధికారి వివరించారు. ప్రభుత్వం నుంచి సానుకూలత కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద కేంద్రం నుంచి రావలసిన రూ.200 కోట్లు లభించినా కొంత మేరకు ఊరట కలుగుతుందని  పేర్కొన్నారు.

కనీసం 10 రైళ్లు అవసరం... 
ప్రస్తుతం నగరంలో 57 రైళ్లు ఉన్నాయి. ఒక్కో ట్రైన్‌కు 3 కోచ్‌లు ఉంటాయి. వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. మరో 10 రైళ్లను అదనంగా కొనుగోలు చేయగలిగితే 30 కోచ్‌లు వినియోగంలోకి వస్తాయి. దాంతో కనీసం రోజుకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మందికి అదనంగా  ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. 3 కోచ్‌లు ఉన్న ఒక ట్రైన్‌కు రూ.65 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. తయారీ సంస్థల నుంచి రైళ్లను కొనుగోలు చేయడంతోపాటు నగరానికి తరలించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ లెక్కన 10 రైళ్లకు సుమారు రూ.650 కోట్లకు పైగా నిధులు అవసరం. కొత్త రైళ్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదా, చార్జీలను పెంచేందుకు అవకాశం ఇవ్వడం పరిష్కారంగా  భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. 
 

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)