Breaking News

కూలి పనికి కుమురంభీం మనవడు 

Published on Sat, 04/19/2025 - 15:09

కెరమెరి (ఆసిపాబాద్‌): గిరిజన వీరుడు కుమురం భీం మనవడు కుమురం సోనేరావు.. చేతిలో చిల్లి గవ్వలేక ఉపాధి పనులకు వెళ్తున్నాడు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు) మండలం దోబే గ్రామానికి చెందిన కుమురం సోనేరావు, గౌరుబాయి దంపతులు.. పదిహేను రోజులుగా ఉపాధి హామీ పథకం కూలి పనికి వెళ్తున్నారు. 

ప్రభుత్వం గతంలో ఐదెకరాల సాగుభూమి ఇచ్చినప్పటికీ.. తలదాచుకునేందుకు ఇల్లు లేదని వాపోయాడు. పలుమార్లు ఇంటి కోసం ఎమ్మెల్యే, కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించినా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నాడు. గతంలో గుస్సాడీ రాజుకు ఇచ్చిన గౌరవం మాదిరిగానే.. తనను గుర్తించి ఆదుకోవాలని, నెలనెల ‘ఆసరా’ పింఛను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.

కూటి కోసం కోటి తిప్పలు..
నిర్మల్‌ జిల్లా (Nirmal District) ఖానాపూర్‌ డబుల్‌ బెడ్‌రూం కాలనీలో.. ఎక్బాల్‌పూర్‌ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాల వారు ప్రదర్శించిన గారడీ (Garadi) ఆకట్టుకుంది. ఎక్బాల్‌పూర్‌లో నక్కలోల్ల (బొందిలోల్ల) కుటుంబాలు కొన్నేళ్లుగా నివసిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఖానాపూర్‌ పట్టణంలోని పలు కాలనీల్లో రాత్రి వేళ గారడీ ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. కాగడాలు ప్రదర్శించడం, రైతు నాగలిని నోటితో ఆపుతూ చేసిన ప్రదర్శనలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

చ‌ద‌వండి: పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన స్మితా స‌బ‌ర్వాల్‌           

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)