నా భర్తను అందుకే చంపేశా..

Published on Wed, 01/21/2026 - 06:57

హైదరాబాద్: ఆ దంపతుల మధ్య రోజూ గొడవలే.. పెద్దలు సర్దిచెప్పినా మనస్పర్దలు తగ్గలేదు.. దీంతో భార్య విసిగిపోయింది.. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీ ని బిగించి ఊపిరి తీసేసింది. ఆ తరువాత మంచంకోడుకు తగిలి చనిపోయాడని బంధువులను నమ్మించింది. అయితే పోస్టుమార్టం నివేదిక మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది. చేసేదిలేక నిందితురాలు నిజం ఒప్పుకుంది. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీ సులు తెలిపిన మేరకు.. 

నూజివీడుకు చెందిన జగ్గవరపు సుదీర్‌రెడ్డి (44), బ్రహ్మ జ్ఞాన ప్రసన్న (43) దంపతులు కూకట్‌పల్లిలోని వివినగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటర్, 5వ తరగతి చదివే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధీర్‌ రెడ్డి ప్రై వేట్‌ ఉద్యోగం చేస్తుండగా భార్య గృహిణి. ఈ క్రమంలో గతనెల 23న రాత్రి సుదీర్‌ రెడ్డి మృతి చెందాడు. మంచంకోడుకు తల బలంగా తగలడం వల్ల చనిపోయాడని భార్య.. బంధువులు, పోలీసులకు చెప్పింది. అయితే సు«దీర్‌రెడ్డి అక్క సునీత మాత్రం.. తన సోద రుడి మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోస్టుమార్టం చేయించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.  

నిజం చెప్పిన పోస్ట్‌మార్టం నివేదిక 
ఈ మృతికి సంబంధించి పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణను వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక కూడా ఆలస్యంగా వచి్చంది. సుధీర్‌ రెడ్డి గొంతుపై నులిమిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో ఉంది. దీంతో పోలీసులు.. మృతుడి భార్య ప్రసన్నను విచారించగా తానే చంపేసినట్లు ఒప్పుకుంది.  

 



వేధింపులు తాళలేకే.. 
కొన్ని సంవత్సరాలుగా దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. పెద్దలు వీరికి సర్దిచెప్పినా పెద్దగా మార్పురాలేదు. నిరంతరం శారీరకంగా, మానసికంగా వేదించటం వల్లే గొడవలు అవుతుండేవని, ఆ రోజు రాత్రి కూడా గొడవ జరిగిందని తెలిపింది. అందుకే మద్యం మత్తులో ఉన్న భర్త గొంతుకు చున్నీ వేసి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.  

 

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)