Breaking News

‘కేటీఆర్‌ టీస్టాల్‌’ మూసివేత వివాదాస్పదం

Published on Thu, 02/20/2025 - 08:59

సిరిసిల్ల టౌన్‌/హైదరాబాద్‌: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘కేటీఆర్‌ టీస్టాల్‌’ను  అధికారులు మూసివేయించడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్‌లైసెన్స్‌ లేకపోవడంతోనే మూసివేయించామని అధికారులు పేర్కొంటుండగా.. కేటీఆర్‌ పేరుతో టీస్టాల్‌ నిర్వహిస్తుండటంతో అధికారులు ఉద్దేశపూర్వకంగా మూసివేయించారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

 బుధవారం జిల్లా కేంద్రం మానేరుతీరంలోని మార్కెట్‌ కాంప్లెక్స్, బతుకమ్మఘాట్‌ పరిసర ప్రాంతాలను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పరిశీలించారు. మడేలేశ్వర ఆలయం ఎదుట రెండు మున్సిపల్‌ టేలాల్లో టీస్టాల్స్‌ ఉండగా.. అందులో ఒకటి కేటీఆర్‌ టీస్టాల్‌ పేరుతో బత్తుల శ్రీనివాస్‌ దంపతులు నడిపిస్తున్నారు. కలెక్టర్‌ పర్యటనలో భాగంగా ఆ టీస్టాల్స్‌కు అనుమతులున్నాయా? అంటూ ఆరా తీస్తూనే ఒకవేళ లేకపోతే మూసివేయాలని మున్సిపల్‌ అధికారులకు మౌఖికంగా ఆదేశాలిచ్చారు. 

విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌ దంపతులు గుండెలు బాదుకుంటూ.. లైసెన్సు తీసుకోవాలని తమకు తెలియదని, అదేంటో చెబితే వెంటనే తీసుకుంటామని అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా కలెక్టర్‌ ఆదేశించారని పేర్కొంటూ టీ స్టాల్‌ మూసివేయించారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు బొల్లి రామ్మోహన్, కత్తెర వరుణ్, దార్ల సందీప్, గెంట్యాల శ్రీనివాస్, సబ్బని హరీశ్‌ ఆందోళన చేపట్టారు.  

ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదలను 
సిరిసిల్లలో జరిగిన ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ‘ఎక్స్‌’లో ఘాటుగా స్పందించారు. ‘చిరువ్యాపారిపై కలెక్టర్‌ అనుచిత ప్రతాపం చూపించారు. ప్రతీది గుర్తు పెట్టుకుంటున్నా.. ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదు. ఇదే మాట మీద ఉంటానని మీకు మాట ఇస్తున్నా’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ మేర కు టీ షాపు యజమాని బి.శ్రీనివాస్‌ మాట్లాడుతున్న వీడియోను షేర్‌ చేశారు.    

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)