ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం 

Published on Mon, 10/02/2023 - 04:02

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయప­రంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్‌’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‌‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్‌ పొందుపరిచా­రని చెప్పారు.

విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్‌తరాల­కు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్‌– టుమారో ఏ లీడర్‌’ అంటారని గుర్తు చేశా­రు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.  

ఎర్రోజు శ్రీనివాస్‌  ‘నడక’ పుస్తకావిష్కరణ 
తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎ­ర్రోజు శ్రీనివాస్‌ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసా­ల­న్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వా­రా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్‌ అభినందించారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)