Breaking News

ఆ పిల్లల చదువు బాధ్యత నాదే

Published on Wed, 07/17/2024 - 04:43

చెన్నారావుపేట: వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్‌ తండాలో ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అండగా నిలిచారు. నిందితుడు నాగరాజు దాడిలో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణలు చనిపోవడంతో పిల్లలు దీపిక, మదన్‌లు అనాథలయ్యారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్నలు మంగళవారం హైదరాబాద్‌లోని కేటీఆర్‌ వద్దకు పిల్లలను తీసుకెళ్లారు.

వారితో మాట్లాడిన కేటీఆర్‌ జరిగిన విషయాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు. సుగుణ బీఆర్‌ఎస్‌ క్రియాశీల కార్యకర్త, గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలు కావడంతో పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. 

కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు నాగరాజుకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కేటీఆర్‌ కోరినట్లు చెప్పారు. 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)