Breaking News

తెలంగాణ ‘జల విజయం’పై ప్రపంచానికి పాఠాలు

Published on Wed, 05/17/2023 - 01:40

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో జరగనున్న ప్రపంచ పర్యావరణ, జల వనరుల సదస్సు (వరల్డ్‌ ఎన్విరాన్‌మెంటల్, వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌)లో.. జలాల విషయంలో తెలంగాణ సాధించిన విజయాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించనున్నారు. అమెరికాలోని నెవడా రాష్ట్రం హెండర్సన్‌ నగరంలో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ (ఎఎస్‌సీఈ) ఈ సదస్సును నిర్వహిస్తోంది.

అందులో కేటీఆర్‌ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం, ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న మిషన్‌ భగీరథ పథకాల ఫలితాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ ఆహా్వనం మేరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్‌ మంగళవారమే అమెరికాకు వెళ్లారు. మొత్తంగా సుమారు పది రోజుల పర్యటన తర్వాత ఈ నెల 25న కేటీఆర్‌ తిరిగి రాష్ట్రానికి వస్తారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

అప్పట్లో ప్రణాళికలు.. ఇప్పుడు విజయాలు 
మంత్రి కేటీఆర్‌ 2017లోనే అమెరికాలోని సాక్రమెంటో వేదికగా జరిగిన ఎఎస్‌సీఈ సదస్సులో పాల్గొని సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, మిషన్‌ భగీరథ తదితరాలను వివరించారు. 2022లో తెలంగాణలో పర్యటించిన ఎఎస్‌సీఈ బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది. ఆ ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి రంగంలో గేమ్‌ చేంజర్‌గా అభివరి్ణంచింది. అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును స్వల్ప సమయంలో పూర్తి చేయడాన్ని ప్రశంసిస్తూ.. జల విజయాన్ని వివరించేందుకు అమెరికా రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది.

అమెరికా నలుమూలల నుంచి సివిల్‌ ఇంజనీర్లు పాల్గొనే ఈ సదస్సులో కేటీఆర్‌ ప్రత్యేకంగా ప్రజెంటేషన్‌ ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ ద్వారా తెలంగాణ సాధించిన సామాజిక, ఆర్థిక ప్రగతిని వివరిస్తారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా ఐదు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో వివిధ రంగాల కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరిస్తారు. ఈ సందర్భంగా పలు అమెరికన్‌ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి.

ఇది కూడా చదవండి: రేపు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)