Breaking News

ఇది ‘కేటీఆర్‌.. ఓ టీస్టాల్‌’ కథా చిత్రం!

Published on Mon, 03/24/2025 - 08:11

సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ చిరు వ్యాపారి.. కేటీఆర్‌ పేరుతో నడుపుకుంటున్న టీ కొట్టు డబ్బాను అధికారులు ఇటీవల ఎన్నికల సమయంలో మూసివేయించిన విషయం తెలిసిందే. దీంతో ఆ వ్యాపారికి కేటీఆర్‌ అండగా నిలిచారు. మళ్లీ టీకొట్టు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. 

గత నెలలో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మఘాట్‌ వద్ద కేటీఆర్‌ పేరు, ఫొటోతో ఉన్న టీస్టాల్‌ను అధికారులు మున్సిపల్‌ ట్రేడ్‌ లైసెన్స్‌ లేదన్న సాకుతో ఫిబ్రవరి 19న మూయించారు. అయితే బీఆర్‌ఎస్‌ అభిమానులు, కేటీఆర్‌ అనుచరులు అదే రోజు సాయంత్రమే హోటల్‌ నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్‌తో టీస్టాల్‌ను తెరిపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న సాయంత్రం టీస్టాల్‌ డబ్బాకు అనుమతి లేదని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు ఆ డబ్బాను పోలీస్‌ రక్షణ మధ్య తొలగించి, ట్రాక్టర్‌పై మరోచోటికి తరలించారు. ఈ చర్యతో శ్రీనివాస్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి కన్నీరు పెట్టుకున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్, బత్తుల శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి తాను అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇచి్చన మాట ప్రకారం ఇటీవల సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా శ్రీనివాస్‌కు ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బులతో మరోచోట హోటల్‌ పెట్టుకోవాలని కేటీఆర్‌ సలహా ఇచ్చారు. కేటీఆర్‌ సలహాతో పట్టణంలోని గాం«దీచౌక్‌లో శ్రీనివాస్‌ కొత్తగా టీస్టాల్‌ను కేటీఆర్‌ పేరుతో ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేటీఆర్, ఎమ్మెల్సీ రమణతో కలసి శ్రీనివాస్‌ టీస్టాల్‌ను ప్రారంభించారు.  

 

#

Tags : 1

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)