Breaking News

ప్రవల్లిక కుటుంబానికి అండగా ఉంటాం 

Published on Thu, 10/19/2023 - 05:10

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక కుటుంబసభ్యులు బుధవారం మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లోని తన కార్యాలయంలో కలసిన ప్రవల్లిక కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ప్రవల్లిక మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

తమ కుమార్తె మరణానికి కారణమైన శివరామ్‌ అనే వ్యక్తిని శిక్షించాలని ప్రవల్లిక కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రవల్లిక మరణం దురదృష్టకరమని, బాధాకర సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి వారిని ఓదార్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర డీజీపీతో కేటీఆర్‌ మాట్లాడి, విచారణ వేగవంతం చేయాలని కోరారు.

ప్రవల్లిక మృతికి కారణమైన వ్యక్తికి తగిన శిక్ష పడేలా చూస్తామని ఆమె కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు. అలాగే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రవల్లిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ‘ధైర్యంగా ఉండండి.. నీ బిడ్డను తెచ్చి ఇవ్వలేను కాని అన్ని విధాలుగా ఆదుకుంటా’అని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు ప్రవల్లిక తల్లిదండ్రులు లింగయ్య, విజయ తెలిపారు.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)