Breaking News

15న ఆ 9 చోట్ల భారీ ర్యాలీలు 

Published on Sat, 09/09/2023 - 03:53

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 15న ఏకకాలంలో తొమ్మిది జిల్లాల్లో కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లా కేంద్రాల్లో కనీసం 15 వేల నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీ రామారావు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ నెల 15న జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభమవుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 15న ఏదో ఒక చోట కొత్త మెడికల్‌ కాలేజీని ప్రారంభిస్తారని, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కామా రెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్‌ తెలిపారు. దేశంలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)