Breaking News

నగర ప్రజలపై కక్షతోనే బస్సు చార్జీల భారీ పెంపు

Published on Mon, 10/06/2025 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీల పెంపు నిర్ణయం హైదరాబాద్‌ ప్రజలపై కాంగ్రెస్‌ కక్ష సాధింపు చర్య అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఆరోపించారు. గత ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్‌ పార్టీని తిరస్కరించారన్న కసితోనే ఈ చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను గుల్ల చేసేందుకే జంట నగరాల్లో సిటీ బస్సు కనీస చార్జీలను ఏకంగా రూ.10 పెంచాలని  రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడుతున్న ప్రజలపై ఈ చార్జీల పెంపు పిడుగులాంటిదని, ప్రతి ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం పడుతుందన్నారు. సిటీలో బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఖండిస్తూ కేటీఆర్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సు చార్జీల పెంపు రేవంత్‌ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీని దివాలా తీయించిన కాంగ్రెస్, ఇప్పుడు సామాన్యుల నడ్డి విరవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)