Breaking News

రేపు ‘ఈడీ‘ ముందుకు కేటీఆర్‌

Published on Wed, 01/15/2025 - 17:17

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌  కేటీఆర్‌(Ktr) గురువారం(జనవరి16) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా- ఈ రేసుల కేసు (Formula-e race case)లో జనవరి 16న  విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చింది. ఈ నోటీసుల్లో కోరిన  మేరకు కేటీఆర్‌ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. 

కేటీఆర్‌ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్‌ నందినగర్‌ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్‌ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ ఇంజినీర్‌ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ కేటీఆర్‌పై ఈసీఐఆర్‌ నమోదు చేసింది. 

ఇదే కేసులో జనవరి మొదటి వారంలోనే ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ తుదితీర్పు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని  తెలపడంతో ఈడీ కేటీఆర్‌కు సమయమిచ్చింది. అనంతరం క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఈడీ విచారణకు కేటీఆర్‌ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మరోవైపు బుధవారం(జనవరి 15) సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ విషయంలో కేటీఆర్‌కు చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పడంతో కేటీఆర్‌ తన క్వాష్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాగా, ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ ఇప్పటికే ఒకసారి ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు. విచారణ కోసం కేటీఆర్‌కు ఏసీబీ మళ్లీ నోటీసులిచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. 

ఇదీ చదవండి: సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు