Breaking News

పబ్‌లో యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన

Published on Thu, 08/07/2025 - 14:01

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–36 లోని క్రిస్టల్‌ క్లబ్‌ పబ్‌లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మణికొండలో నివసించే యువతి (29) మంగళవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి క్రిస్టల్‌ పబ్‌కు వచ్చారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో వీరి వెనుక సీట్లో కూర్చొన్న ఓ యువకుడు వాటర్‌ బాటిల్‌ను యువతి ఉన్న చోటికి వదిలాడు. 

తీసుకునే క్రమంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. రాత్రి 12.10 గంటల ప్రాంతంలో సదరు యువతి స్నేహితురాలితో కలిసి బయట నిలబడగా భరత్, మారుతి, డోనాల్డ్‌ అనే ముగ్గురు యువకులు బయటకు వచ్చి మరోసారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే ఆమె సోదరుడు బయటకు రాగా తీవ్రంగా కొట్టారు. ఆపేందుకు వెళ్లిన ఆమెను దూషించారు. 

విషయం తెలుసుకున్న బౌన్సర్లు బయటకు వచ్చి యువకులను కట్టడి చేసేందుకు యతి్నంచగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో బాధిత యువతితో  పాటు ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు కాగా, అదే రోజు అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. జరిగిన ఘటన పట్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు భరత్, మారుతి, డోనాల్డ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)