Breaking News

‘సాగర్‌’ను సందర్శించిన కేఆర్‌ఎంబీ బృందం

Published on Fri, 02/23/2024 - 02:59

నాగార్జునసాగర్‌: కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) అధికారులు స్థానిక ఇంజనీర్లతో కలసి గురువారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్‌ డ్యామ్‌పై బీటీరోడ్డు వేయడంతో పాటు సీజనల్‌గా చేయాల్సిన నిర్వహణ పనులైన డ్యామ్‌ రేడియల్‌ క్రస్ట్‌గేట్లకు రబ్బరు సీళ్లు, గ్యాలరీలలో సీపేజ్‌ నీరు రాకుండా మరమ్మతులు, గేట్లు ఎత్తి, దింపే స్టార్టర్‌లలో ప్యానల్‌ బోర్డులు, మోటార్ల మరమ్మతుల వంటి పనులు చేయాల్సి ఉంది.

ఈ నెల 16వ తేదీన తెలంగాణ ఇంజనీర్లు నిర్వహణ పనులను ప్రారంభించారు. అయితే, ఈ పనులు చేయవద్దని ఏపీ వైపున ఉన్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది అభ్యంతరం తెలిపారు. తెలంగాణ అధికారులు అలాగే పనులు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయమై కేఆర్‌ఎంబీకి లేఖలు రాసింది. దీంతో స్పందించిన కేఆర్‌ఎంబీ అధికారులు గురువారం సాగర్‌డ్యామ్‌ మీదకు వచ్చి పరిశీలించారు.

డ్యామ్‌ మెయింటెనెన్స్‌ పనులు చేసుకోవచ్చని చెప్పారు. శుక్రవారం కేఆర్‌ఎంబీ అధికారులు సాగర్‌డ్యామ్‌తో పాటు కుడి, ఎడమ కాల్వల హెడ్‌రెగ్యులేటర్లను సందర్శించనున్నట్లు సమాచారం. సాగర్‌డ్యామ్‌పై పర్యటించిన వారిలో కేఆర్‌ఎంబీ ఎస్‌ఈ వరలక్ష్మి, సాగర్‌డ్యామ్‌ ఎస్‌ఈ నాగేశ్వర్‌రావు, ఈఈ మల్లికార్జున్‌రావు, డీఈ శ్రీనివాసరావు, ఏఈ కృష్ణయ్య, సీఆరీ్పఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్, ప్రత్యేక రక్షణ దళం కమాండెంట్‌ పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)