Breaking News

రూ.300 కోట్లతో ‘షూఆల్స్‌’ కర్మాగారం!

Published on Fri, 10/25/2024 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: మెడికల్, స్మార్ట్‌ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్‌ కొరియన్‌ కంపెనీ తెలంగాణలో కర్మాగారం ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 750 ఎకరాలు కేటాయిస్తే రూ. 300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పిందన్నారు. దక్షిణ కొరియా నుంచి వచి్చన షూఆల్స్‌ చైర్మన్‌ చెవోంగ్‌ లీ, ఆ సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో తనను కలిసినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. 87 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగల గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారన్నారు.

మెడికల్‌ చిప్‌తో కూడిన బూట్ల సోల్స్, జీపీఎస్‌ అమర్చిన బూట్లు, 10 వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బూట్లతోపాటు మధుమేహం, కీళ్ల నొప్పుల బాధితులకు నడకలో ఉపశమనం కలిగించే పలు రకాల ఉత్పత్తులను తాము తయారు చేస్తామని చెవోంగ్‌ లీ పేర్కొన్నట్లు శ్రీధర్‌బాబు వివరించారు. అలాగే 5 వేల ఎకరాలు కేటాయిస్తే ఆసియాలో ఎక్కడాలేని విధంగా స్మార్ట్‌ హెల్త్సిటీని నెలకొల్పే ప్రతిపాదనను కొరియా బృందం చేసిందన్నారు.  

రాష్ట్రంలో పెట్టుబడులకు రైన్లాండ్‌ ఆసక్తి
రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీ దేశంలోని రైన్లాండ్‌ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రైన్లాండ్‌ రాష్ట్ర ఆర్థిక, రవాణా, వ్యవసాయ మంత్రి డానియేలా ష్మిట్‌ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. చెన్నైలోని జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కూష్లెర్, హైదరాబాద్‌ కాన్సుల్‌ అమితా దేశాయ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు, బయో టెక్నాలజీ, వ్యా క్సిన్‌లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్‌ వంటి విభాగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)