Breaking News

సమస్యల పరిష్కారానికి సీఎంను కలుస్తా: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Published on Sun, 08/11/2024 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని లోక్‌సభలో బీజేపీ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్టు కట్టడం కంటే ముందు ఎస్టీపీల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని సూచించారు. జంట జలాశయాలకు సంబంధించి ఇప్పుడు 111 జీవో అమలులో ఉందా? లేక 69 జీవో అమలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు.

శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎంను కలిసిన సందర్భంగా 111 జీవోపై నివేదిక ఇస్తానని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు ప్రస్తావించలేదన్న విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇచ్చామంటున్న విపక్షాలు, తెలంగాణకు గత ఆరు నెలల్లో రూ. 40 వేల కోట్లు ఇప్పటికే ఇచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.

 ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రస్తావించారన్నారు. వక్ఫ్‌ బోర్డు బిల్లు ముస్లింలకు వ్యతిరేమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వచ్చే పార్లమెంటు సమావేశంలో వక్ఫ్‌ బోర్డు బిల్లు ఆమోదం పొందుతుందని, దీని వల్ల ముస్లింలకు లాభం జరుగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూ. 9,400 కోట్ల సర్వశిక్షా అభియాన్‌ నిధులు మురిగిపోయాయన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)