Breaking News

కొండా సుస్మిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published on Thu, 10/16/2025 - 13:49

త‌న త‌ల్లిదండ్రుల‌కు ఏమైనా హానీ జ‌రిగితే సీఎం రేవంత్‌రెడ్డిదే బాధ్య‌త అంటున్నారు తెలంగాణ దేవాదాయ‌, అట‌వీ శాఖ‌ల‌ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కుమార్తె సుస్మిత. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అడ్డం పెట్టుకుని త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఆరోపించారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి వ‌చ్చిన పోలీసుల‌ను ఆమె అడ్డుకున్నారు.

బుధ‌వారం రాత్రి ఆమె త‌న ఇంటి వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ.. ''బీసీ లీడ‌ర్ల‌ను, మ‌మ్మ‌ల్ని తొక్క‌డానికి ట్రై చేస్తున్నారు. ఎక్స్‌టార్స‌న్ కేసు అంటున్నారు. ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్న‌ను తీసుకొద్దామ‌ని ట్రై చేస్తున్నార‌ని నా డౌట్‌. ఆ డౌట్‌లో మాత్రం మానాన్న‌కు కానీ, మా అమ్మ‌కు కానీ ఎటువంటి హాని జ‌రిగినా పూర్తి బాధ్య‌త‌ రేవంత్‌రెడ్డి, వేం న‌రేంద‌ర్‌రెడ్డి, క‌డియం శ్రీహ‌రి, పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, రోహిన్ రెడ్డిల‌దే. వీళ్లంద‌రు మాత్రం బాధ్య‌త వ‌హించాలి. నేను ముందే చెబుతున్నా.

ఇది కాంగ్రెసా, తెలుగుదేశ‌మా తెలుస్త‌లేదండీ. రెడ్ల రాజ్యం న‌డుస్తోంది. బీసీ నినాద‌మేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎత్తుకుంటే.. ఇక్క‌డ‌ బీసీ మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్‌ సీఐ వ‌స్త‌డా? అస‌లు ఎక్క‌డైనా ఉందా? ఎంత సిగ్గుమాలిన చ‌ర్య‌? ఒక ముఖ్య‌మంత్రి సిగ్గుప‌డాలి దానికి. ఒక బీసీ లేడీ లీడ‌ర్ ఇంటికి రాత్రి తొమ్మిదింటికి ఒక టాస్క్‌ఫోర్స్‌ సీఐ వ‌చ్చిండంటే ముఖ్య‌మంత్రి సిగ్గుప‌డాలి. అయామ్ టెల్లింగ్ ఆన్ మీడియా'' అంటూ సుస్మిత ఫైర్ అయ్యారు. కాగా, నిన్న‌రాత్రి  తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను క‌ట్టుబ‌డి ఉన్నానని గురువారం మీడియా ప్ర‌తినిధుల‌కు స్ప‌ష్టం చేశారు కొండా సుస్మిత‌.

 చ‌ద‌వండి: కొండా సురేఖ వివాదం.. అస‌లేం జ‌రిగింది?

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)