Breaking News

మాపై సీఎం రేవంత్‌ కుట్ర.. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణ

Published on Thu, 10/16/2025 - 04:36

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): తమ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. రెడ్లందరూ కలసి తమ కుటుంబంపై పగబట్టారని విమర్శించారు. బుధవారం రాత్రి మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. 

జూబ్లీహిల్స్‌ ఎంపీ ఎమ్మెల్యే కాలనీ లోని కొండా సురేఖ నివాసం వద్దకు నలుగురు వ్యక్తులు వచ్చి సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ గురించి ఆరాతీశారు. సుమంత్‌ను అరెస్టు చేసేందుకే వారు వచ్చినట్లు తెలుసుకున్న సుస్మిత బయటకు వచ్చి.. ‘ఎవరి కోసం వచ్చారు?.. ఎందుకొచ్చార’ని ప్రశ్నించారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో మీడియా చేరుకుంది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

రాజకీయంగా అణగదొక్కేందుకే..: ఈ వ్యవహారంపై కొండా సుస్మిత ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. బీసీ మంత్రి అయిన తన తల్లిని రాజకీయంగా అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఈరోజు సుమంత్‌పై కేసు పెట్టి, అర్ధరాత్రి ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. 

కాంగ్రెస్‌ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండటమే మేం చేసిన తప్పా?. రేవంత్‌రెడ్డి మా కుటుంబంపై ఎందుకు పడ్డాడు? రేవంత్‌రెడ్డి అన్నదమ్ములైన తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి పార్టీకి ఏం చేశారని గన్‌మెన్లను ఇచ్చారు?’ అని ఆమె విరుచుకుపడ్డారు. కాగా, జూబ్లీహిల్స్‌ పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి చేరుకుని మఫ్టీలో వచ్చిన వారి గురించి ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో సురేఖ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)