Breaking News

కేసీఆర్‌.. రూ.2 వేల కోట్ల లెక్క చెప్పు

Published on Mon, 12/29/2025 - 05:15

నల్లగొండ టూటౌన్‌: ‘అల్లుళ్లు హరీశ్‌రావు, సంతోశ్‌రావులు రూ.2 వేల కోట్లు దోచుకున్నారని కేసీఆర్‌ సొంత కూతురు కవితే చెప్పింది. వాళ్లు దోచుకున్న రూ.2 వేల కోట్లకు లెక్కలు చెప్పు కేసీఆర్‌’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ మైదానం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్ద గడియారం సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.

గత 24 నెలలుగా కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా రూ.1.20 కోట్ల జీతం తీసుకున్నారని మంత్రి విమర్శించారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే ఎవరూ భయపడరని, ఆ మొనగాడిని ఉతికి ఆరేస్తామని అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ, గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారన్నారు. కానీ కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఒక్క రేషన్‌కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు.  

అమరావతికి రోడ్డు.. 
నల్లగొండ జిల్లా కనగల్‌ –గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్‌ సిటీ నుంచి ఏపీలోని అమరావతి వరకు రూ.20 వేల కోట్లతో నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్‌వే రహదారి సర్వే ప్రారంభమైందని, ఈ రోడ్డు కనగల్, గుర్రంపోడు మండలాల మధ్య నుంచి అమరావతికి వెళుతుందని స్పష్టం చేశారు. కాగా, పదవులు శాశ్వతం కాదని తాను ఢిల్లీకి వెళ్లకున్నా మంత్రి పదవి వచ్చిందని అన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ కేతావత్‌ శంకర్‌నాయక్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)