Breaking News

త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు

Published on Wed, 01/24/2024 - 04:08

సాక్షి, హైదరాబాద్‌: త్వరలోనే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీ నెరవేరబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. హామీల అమలుపై సమీక్షలు జరిపి వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్‌ సర్కారు గుల్ల చేసిందని, అందుకే హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు.

ఇక, కరెంటు బిల్లులు కోమటిరెడ్డి ఇంటికి పంపాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌ అయ్యారు. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాల్లో జగదీశ్‌రెడ్డి పాత్ర కూడా ఉందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని, ఆయన తోపాటు కేటీఆర్, కవితలకూ జైలు తప్పదన్నారు. 200 యూ నిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోతే కరెంటు బిల్లులు తమకు పంపాలని బీఆర్‌ఎస్‌ ప్రజలను రెచ్చగొడుతోందని, రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీ ఆర్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తాము నిరుద్యోగులను ఇలాగే రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చేవారా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమాల నిగ్గు తేల్చే పనిలో ఉన్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ చీలికలు, పీలికలు అవుతుందని, ఒక్క పార్లమెంట్‌ స్థానంలో కూడా బీఆర్‌ఎస్‌ గెలవదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య