కేసీఆర్‌కు ఓటమి భయం 

Published on Sun, 08/06/2023 - 05:19

నల్లగొండ రూరల్‌: సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల సమయంలో దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలు పెడుతున్నాడని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ‘బంధు’పథకాలతో బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో బంద్‌ అవుతుందని చెప్పారు. నల్లగొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు శనివారం ఆయన కాంగ్రెస్‌ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించి మాట్లాడారు.

భూ మండలం తలకిందులైనా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌.. నేడు ఎన్నికల కోసం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంటున్నాడని విమర్శించారు. కేసీఆర్‌ మాట లకు, ఉత్తుత్తి జీవో కాపీలకు మోసపోవద్దని సూచించారు. గ్రామపంచాయతీ కారి్మకులు 30 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పారిశుధ్య పనులు చేపడితే వారికి సమాజం పాదాభివందనం చేసిందని, అలాంటి వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు.

మీరు పోరాటం ఆపొద్దని సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కారి్మకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. ఏపీ సీఎం జగన్‌ అక్కడి ప్రజలకు వైద్యం ఖర్చు రూ.వెయ్యి దా టితే పెద్ద ఆస్పత్రిలో పూర్తి స్థాయి వైద్యం ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారని కోమటిరెడ్డి చెప్పారు. వంద రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)