Breaking News

అయ్యా రేవంత్‌ రెడ్డి పదవులూ మీకే.. పైసలూ మీకేనా?

Published on Sat, 08/16/2025 - 07:21

సంస్థాన్‌ నారాయణపురం: ‘పదవుల్లో మీరే ఉంటరు.. పైసలు మీరే తీసుకుంటరు. నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పదవి వచ్చేటప్పుడు వస్తుంది. మనను ఎవరూ ఆపలేరు. 

పదవులు మీకే.. పైసల్‌ మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్‌రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరకి వెళ్లి అడిగినా రాలే. పనిచేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్‌ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి’ అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)