amp pages | Sakshi

కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు.. కేసీఆర్‌ ఏమన్నారంటే...

Published on Fri, 08/04/2023 - 09:59

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో భూముల ధర ఎకరాకు రూ.100 కోట్లకుపైగా పలకడం తెలంగాణ పరపతికి నిదర్శమని, రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు పోటీపడి, ఇంత ధర చెల్లించి మరీ తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని ప్రకటించారు. ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్టుగా హైదరాబాద్‌ నగర అభివృద్ధి అందనంత ఎత్తుకు దూసుకుపోతోంది.

తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగమవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్‌ ఆత్మ గౌరవాన్ని కించపర్చిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, కృషికి దక్కిన ఫలితమిది..’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్, హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ ఉన్నతాధికారులను అభినందించారు.   
(చదవండి: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు)

Videos

అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

రెండోసారి కూడా మన ప్రభుత్వమే..

పార్లమెంట్ సెక్యూరిటీపై కేంద్రం కీలక నిర్ణయం

ఐదో దశకు సర్వం సిద్ధం..

వాన పడింది..వజ్రాల వేట షురూ..

YSRCP దే ఘన విజయం..

ఔటర్ రింగ్ రోడ్డుపై హైడ్రామా

కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఈసీని కోరిన వైఎస్ఆర్ సీపీ నేతలు

చంద్రబాబు, నారా లోకేష్ పై పెద్దిరెడ్డి ఫైర్

సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)