Breaking News

కోకాపేట్‌.. మరో జాక్‌పాట్‌!

Published on Tue, 07/21/2026 - 08:02

సాక్షి, హైదరాబాద్‌: సర్కార్‌కు పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపిస్తున్న కోకాపేట్‌లో మరో భారీ వెంచర్‌ కోసం  హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)  ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు గతంలో ఐటీ సెజ్‌ కోసం కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకొనేందుకు (సెజ్‌ డీనోటిఫై) చర్యలు చేపట్టింది. 

అప్పట్లో సుమారు 117 ఎకరాలను ఐటీ సెజ్‌ కోసం కేటాయించారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే  ఇక్కడ భూమిని  కొనుగోలు చేశాయి. ప్రస్తుతం 90 ఎకరాలకు పైగా అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ  భూములనే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంతకాలంగా  కోకాపేట్‌  భూములు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నగరానికి పడమటి వైపున ఐటీ తదితర వ్యాపార సంస్థలు కొలువుదీరి కోకాపేట్‌  భూములు వ్యాపార, రియల్‌ దిగ్గజ సంస్థలకు కొంగుబంగారంగా మారాయి. ఎకరం రూ.వంద కోట్లపైనే  అమ్ముడవుతుంది. ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లోనూ ఎకరం గరిష్టంగా  రూ.151 కోట్లకు అమ్ముడైంది.

 సగటున రూ.142 కోట్లకు ఎకరం చొప్పున విక్రయించారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు  ప్రభుత్వం  ప్రయత్నిస్తోంది. సెజ్‌ హోదాను డీ నోటిఫై చేయడం ద్వారా భూముల విక్రయానికి మార్గం సుగమం కానుంది. ఎకరం సగటున రూ.వంద కోట్ల చొప్పున  అమ్ముడైనా ఈ భూముల ద్వారా సుమారు రూ.9 వేల కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చునని అధికారులు  అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట్‌ నియోపొలిస్, గోల్డ్‌మైల్‌ తదితర లే అవుట్‌లలో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌కు అనూహ్య స్పందన లభించింది.

మౌలిక సదుపాయాలతో వెంచర్‌... 
కేంద్రం ఐటీ సెజ్‌ హోదాను రద్దు చేసిన వెంటనే అన్ని మౌలిక సదుపాయాలతో వెంచర్‌ను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నియోపోలిస్‌ వెంచర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. కొత్త వెంచర్‌ను సైతం ఇలాగే అభివృద్ధి చేయనున్నారు.  

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)