Breaking News

స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి

Published on Mon, 10/20/2025 - 09:57

జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వా«దీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్‌ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్‌ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్‌కు తెలిపారు. 

అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వా«దీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్‌కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్‌ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)