Breaking News

హోంగార్డులూ..ఆత్మహత్యలు చేసుకోకండి

Published on Fri, 09/08/2023 - 03:43

సంతోష్ నగర్‌: హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..పోరాడి హక్కులు సాధించుకుందామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణాపాయస్థితిలో అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌ను ఆయ న గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోందని..వారికి కనీస హక్కు లు ఇవ్వడం లేదన్నారు. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తుందన్నారు. ఈ ఘటనపై  విచారణ జరగాలన్నారు. ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. 

ధర్నాకు కిషన్‌రెడ్డి మద్దతు: అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రి ఆవరణలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న హోంగార్డులకు కిషన్‌రెడ్డి మద్దతు తెలిపారు.  17 సంవత్సరాలుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్న రవీందర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. మనం అవసరమైతే పోరాటం చేద్దాం కానీ.., ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాగా, హోంగార్డులను ఇలాంటి పరిస్థితిలో తాను ఎప్పుడూ చూడలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. అంతకు ముందు ఆయన రవీందర్‌ను పరామర్శించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)