పత్తి.. ఎంతైనా కొంటాం

Published on Wed, 10/08/2025 - 05:53

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పత్తి రైతులు ఎంత పండిస్తే అంత పత్తిని కొనుగోలు చేస్తామని.. పత్తి చివరి కిలో వరకూ సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని పత్తి రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. బాధ్యతల నుంచి పారిపోతోందని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ఉండాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలోని ఉద్యోగ్‌ భవన్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ తదితరుల బృందం రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను వివరించేందుకు గిరిరాజ్‌ సింగ్‌తో సమావేశమైంది. 

అనంతరం గిరిరాజ్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణలో 20 లక్షల మంది పత్తి రైతులు 18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తుండగా వారి నుంచి సీసీఐ 80 శాతం పత్తిని కొనుగోలు చేస్తోంది. గతంలో ఎంత సేకరించామో అంతకు మించి సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల కమిటీలను ఏర్పాటు చేసి వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. పత్తిలో తేమ శాతం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా అలా చేయట్లేదు. ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించుకొని పత్తిని ఆరబెట్టి ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు పంపాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రంపై మాత్రం నిందలు వేస్తోంది. ఇది సరికాదు’అని పేర్కొన్నారు. 

రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంట విక్రయించొద్దు: కిషన్‌రెడ్డి 
పత్తి రైతులు ప్రైవేటు వ్యక్తులకు పంటను విక్రయించొద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. తేమ శాతం ఎక్కువుందన్న పేరుతో ప్రైవేటు వ్యక్తులు ధర తగ్గించి కోనుగోలు చేయడం వల్ల రైతులకే నష్టం జరుగుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పత్తి కొనుగోళ్లలో ఏటా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా వాటిని పరిష్కరించేందుకే కేంద్ర మంత్రితో సమావేశమయ్యాం. సీసీఐ చైర్మన్‌తోనూ పలు విషయాలు చర్చించాం. పత్తిలో 12 శాతం తేమ ఉన్నా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను సీసీఐ కొనుగోలు చేస్తోంది. పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని గిరిరాజ్‌ సింగ్‌ను కోరాం. హై డెన్సిటీ కాటన్‌ ప్లాంటేషన్‌ ద్వారా రైతుల ఆదాయం మూడింతలు అవుతోంది. తెలంగాణలో ఎందుకు ఆ విత్తనాలను వినియోగించట్లేదని గిరిరాజ్‌సింగ్‌ అడిగారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 122 సెంటర్లలోని రైతు కమిటీల ప్రతినిధులు, అధికారులకు సమస్యలను చెబితే వారు వెంటనే పరిష్కరిస్తారు. తేమ శాతాన్ని కచి్చతత్వంతో కొలిచే ఆధునిక మెషీన్లను అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు.   

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)