Breaking News

మూడేళ్లలో కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పూర్తి

Published on Mon, 07/27/2026 - 01:03

సిద్దిపేటజోన్‌: మరో మూడేళ్లలో మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే లైన్‌ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో రూ. 6 కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. డిసెంబర్‌ నాటికి సిరిసిల్ల, 2028 జూన్‌ నాటికి వేములవాడ రైల్వే స్టేషన్లను అందుబాటులోకి తెచి్చ, 2029 నాటికి కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభం చరిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. సికింద్రాబాద్‌ నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్‌ రైల్వేలైన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తే రైల్వే పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్‌ ట్రైన్‌లు ఉండగా వాటిలో మూడు తెలంగాణ ప్రాంతానికి అనుసంధానం కావడంతో ఎంతో ప్రయోజనం కలుగుతోందని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వం ఏది ఉన్నా నరేంద్రమోదీ సమన్యాయం పాటించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కొమురవెల్లి భక్తుల కల సాకారం అయిందని, ఆలయ అభివృద్ధి, విస్తరణకు రవాణా వ్యవస్థ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, మాజీ గవర్నర్‌ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రొటోకాల్‌ రగడ.. 
కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభ వేడుకల్లో ప్రొటోకాల్‌ అంశం వివాదాలకు దారి తీసింది. ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు నినాదాలు చేశారు. మరోవైపు జై శ్రీరామ్‌ అంటూ కొందరు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ప్రొటోకాల్‌ అంశంపై జిల్లా కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేసి ప్రారంభ వేడుక కంటే ముందే వెళ్లిపోయినట్టు సమాచారం. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)