13, 14 తేదీల్లో ‘సింగరేణి భరోసా యాత్ర’

Published on Sun, 07/12/2026 - 04:38

సాక్షి, హైదరాబాద్‌: తాడిచెర్ల–2 కోల్‌ బ్లాక్‌ కేటాయింపుతో సింగరేణి కార్మికులకు కలగనున్న భరోసాపై బీజేపీ ఆధ్వర్యంలో 13, 14 తేదీల్లో ‘సింగరేణి భరోసా యాత్ర’ను చేపట్టనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈయాత్రలో బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిల్‌లో పక్షనేత ఏవీఎన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.

శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మొదట కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో కార్మికులను కలిసి, ఆ తర్వాత మణుగూరు మీదుగా ప్రయాణించి, రాత్రికి భూపాలపల్లి చేరుకుని అక్కడే బస చేస్తారని చెప్పారు. 

మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల.. ఇలా నాలుగు జిల్లాల్లో పర్యటిస్తూ, మూడుచోట్ల బహిరంగ సభలు, ఐదు బొగ్గు గనుల వద్ద కారి్మకులతో గేట్‌ మీటింగ్స్‌ ఉంటాయని తెలిపారు. 14న ఉదయం భూపాలపల్లిలోని కేటీకే–8 మైన్‌ వద్ద కార్మికులను బీజేపీ నేతలు కలిసి మాట్లాడతారన్నారు. అక్కడి నుంచి తాడిచెర్ల–2 బ్లాక్‌ను సందర్శించి, అనంతరం గోదావరిఖనిలోని ఓపెన్‌ కాస్ట్‌ గనులను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఎస్‌ఆర్‌పీ–3 గనిని సందర్శించి, చివరగా మందమర్రి–చెన్నూరు నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందని తెలిపారు. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)