నూనె తాగి.. మొక్కు తీర్చి

Published on Sun, 01/08/2023 - 00:49

నార్నూర్‌: ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా ఖందేవ్‌ జాతర శనివారం ప్రారంభమైంది. పక్షం పాటు జరగనున్న జాతరకు ఉమ్మడి జిల్లాలు సహా వివిధ రాష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు భారీగా త రలి వచ్చారు. తమ ఆరాధ్య దైవమైన ఖందేవునికి ఏటా పు ష్య పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటా రు. ఇందుకోసం తమ ఇళ్లలో తయారుచేసిన నువ్వుల నూనె ను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ప్రతి ఇంటి నుంచి సేకరించిన నూనెను తొడసం వంశ ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం అనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా జివితి తాలుకా కొద్దిగూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి శనివారం ఆల య సన్నిధిలో రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొ క్కు తీర్చుకుంది. ఇలాచేస్తే సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుందని వారి నమ్మకం. అనంతరం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో తొ డసం వంశ పెద్దలు బాపూరావ్‌ కటోడా, ఆనందరావ్‌ కటో డా, రాజు, యాదవ్‌రావ్, బండు, గోపాల్‌ పాల్గొన్నారు. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)