Breaking News

నీకు మగతనం లేదు.. నీతో సంసారం చేయలేను..!

Published on Mon, 07/20/2026 - 07:32

ఖమ్మం జిల్లా: వివాహం జరిగి మూడు నెలలు కూడా గడవకముందే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, అత్తింటి వారి వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆయన కుటుంబీకులు ఆరోపించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన భూక్యా సదర్‌లాల్‌ (27) డిగ్రీ పూర్తయ్యాక తండ్రి రాములుతో కలిసి పండితాపురం సంతలో మేకల వ్యాపారం చేసేవాడు. ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన మూడో రోజు నుంచే భార్య ఆయనకు మగతనం లేదని అవమానిస్తూ వేధించేదని తెలిసింది.

ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లిన సదర్‌లాల్‌ను భార్య, ఆమె కుటుంబ సభ్యులు అవమానించడంతో ఆయన శనివారం సాయంత్రం అక్క ఇంటికి వెళ్తున్నానని చెప్పి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన బావకు ఫోన్‌ చేసి లొకేషన్‌ పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వి.వెంకటాయపాలెం సాగర్‌ ప్రధాన కాలువ వద్దకు వెళ్లేసరికి అక్కడ సదర్‌లాల్‌ ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్, కలుపు మందు డబ్బా కనిపించాయి. 

ఈమేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు కాలువలో గాలింపు చేపట్టి ఆదివారం మృతదేహాన్ని వెలికితీశారు. కాలువలో దూకే ముందు ఆయన కలుపు మందు తాగి ఉండొచ్చని భావిస్తున్నట్లు సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు. కాగా, వివాహానికి ముందే యువతికి మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి తర్వాత కూడా అతనితో సంబంధాలు కొనసాగించేందుకు సదర్‌లాల్‌కు మగతనం లేదని పంచాయితీ పెట్టించడంతో వైద్య పరీక్షలు చేయించామని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)