Breaking News

మహిళ మృతికి అబార్షన్‌ ట్యాబ్లెట్లే కారణమా?

Published on Wed, 05/10/2023 - 13:35

ఖమ్మం: మండలంలోని మాలబంజర గ్రామానికి చెందిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఈ ఘటనపై సుజాతనగర్‌ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన భూక్యా దివ్య (26)కు అదే గ్రామానికి చెందిన జగపతితో వివాహం జరిగింది. దివ్యకు మొదటి, రెండు కాన్పుల్లో మగ పిల్లలే జన్మించారు. మూడు నెలలుగా రుతుస్రావం కాకపోవడంతో ఈ నెల 5న రుతుస్రావం కోసం ట్యాబెట్లు వేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం రక్తస్రావానికి గురికాగా వైద్యం నిమిత్తం ఆమెను కుటుంబ సభ్యులు కొత్తగూడెం తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, కాన్పు ఇష్టం లేక గర్భాన్ని తొలగించుకోవాలనే ఉద్దేశంతో అబార్షన్‌ ట్యాబెట్లు వేసుకొందనే ప్రచారం జరుగుతోంది. చండ్రుగొండ మండలం మేకలబండకు చెందిన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.తిరుపతిరావు తెలిపారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)