Breaking News

గచ్చిబౌలి కాల్పుల కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

Published on Sun, 02/02/2025 - 15:40

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్‌ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రభాకర్‌ నుంచి ఘటన స్థలంలోనే రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్‌లో బస చేసిన ప్రభాకర్.. వైజాగ్ జైలులో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్‌ తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. జైలులో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్‌ కుట్ర పన్నినట్లు సమాచారం.

కాగా, కరడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌ వద్ద పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో మాదాపూర్‌ సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వెంకట్‌రెడ్డికి బుల్లెట్‌ గాయమైంది. ఏపీలోని చిత్తూరు జిల్లా సోముల గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్‌.. ఏపీ, తెలంగాణలో అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అతడిపై రెండు రాష్ట్రాలలో 70కి పైగా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: 13 ఏళ్లకు పట్టుబడ్డాడు!

సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే 16 చోరీ కేసులున్నాయి. 2023 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రభాకర్‌ తరచు  ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ప్రిజం పబ్‌కు వెళ్తున్నాడని గుర్తించిన పోలీసులు.. అతడిని పట్టుకునేందుకు స్కెచ్‌ వేశారు. మాదాపూర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు వెంకట్‌రెడ్డి, వీరస్వామి, ప్రదీప్‌రెడ్డి ప్రిజం పబ్‌ వద్ద కాపు కాశారు. ప్రభాకర్‌ పబ్‌ వద్దకు రాగానే నిర్బంధించేందుకు ప్రయత్నించాడు.

దీంతో అతడు తనవద్ద ఉన్న దేశీయ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్‌ వెంకట్‌రెడ్డి ఎడమ పాదంలోంచి దూసుకెళ్లింది. అయినా వెనుకడుగు వేయకుండా పబ్‌లోని బౌన్సర్ల సాయంతో మిగిలిన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ప్రభాకర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రెండు తుపాకులు, 23 బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వినీత్‌ తెలిపారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)