పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించిన కేతిరెడ్డి

Published on Wed, 04/30/2025 - 08:10

హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నివాళులర్పించారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని తన సంస్థ కార్యాలయంలో కొవ్వొత్తులు వెలిగించి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, "దేశంలోని ఎక్కడ జరిగిన ఘటన అయినా, అది మొత్తం దేశానికే సంబంధించినదే.

అమాయకులు అయిన ప్రజలు విహార యాత్రకు వెళ్లి మరణించడం బాధాకరమన్నారు. సరిహద్దు భద్రత పటిష్టంగా లేకపోతే ఇలాంటి దాడులు జరుగుతాయి. సరిహద్దులను కాపాడడం అత్యంత క్లిష్టమైన పని. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయం కాకుండా దేశ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలి" అన్నారు. ఇకపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కతాటిపై దేశ ప్రజలంతా నిలబడాలని, బాధిత కుటుంబాలకు మనమంతా మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువశక్తి సభ్యులు  పాల్గొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)