Breaking News

చేతి కర్రతోనే పొలం బాట

Published on Sat, 04/06/2024 - 04:52

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ / కరీంనగర్‌ రూరల్‌ / సిరిసిల్ల:     సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్‌ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు.

అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్‌ రూరల్‌ మండలం ముగ్దూంపూర్‌లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్‌ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్‌ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్‌ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, డాక్టర్‌ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్‌ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్‌సింగ్, మేయర్‌ సునీల్‌రావు తదితరులు ఉన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)