Breaking News

తెలంగాణ జాతికి కేసీఆర్‌ హీరో

Published on Tue, 02/18/2025 - 06:18

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ జాతిపిత కేసీఆర్‌. నా ఒక్కడికే కాదు అందరికీ ఆయన బాపు. తెలంగాణ జాతికి, నాలుగు కోట్ల ప్రజలకు హీరో. సమైక్య పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించిన మహానుభావుడు. కారణ జన్ముడు ఆయన. కేసీఆర్‌ కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు 71వ జన్మదినం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకల్లో కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ధన, కుల, మీడియా బలం లేకున్నా.. 25 ఏళ్ల క్రితం జనబలం, గుండె బలంతో పార్టీని ఏర్పాటు చేసి అవమానాలు, ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని తెలంగాణ కలను సాకారం చేశారు’అని అన్నారు. తెలంగాణలోని ఏ మూలకు వెళ్లి పలకరించినా అన్ని వర్గాలు.. కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ‘తెలంగాణ అనే పసిగుడ్డును తిరిగి ఆయన చేతిలో పెట్టడమే కేసీఆర్‌కు మనం ఇచ్చే బహుమానం. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా 60 లక్షల మంది గులాబీ సైనికులు పనిచేయాలి’అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం: హరీశ్‌రావు 
‘కేసీఆర్‌ ఒక వ్యక్తి కాదు. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. ఆయనకు తెలంగాణతో ఉన్న బంధం, తల్లీబిడ్డల పేగుబంధం లాంటిది. గతంలో తెలుగుదేశంలో పనిచేసినా కేసీఆర్‌ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించారు. కేసీఆర్‌ మొండి పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. తెచి్చన తెలంగాణను కన్నబిడ్డలా చూసుకుని, పదేళ్లలో అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశానికే రోల్‌మోడల్‌గా చేశారు. కేసీఆర్‌ తెచ్చిన తెలంగాణలో సీఎం రేవంత్‌ 20–20 మ్యాచ్‌లు అంటూ.. డబ్బుల కోసం తొండి మ్యాచ్‌ ఆడుతున్నారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని రేవంత్‌ తాపత్రయపడుతున్నారు. అన్ని వర్గాలూ.. రేవంత్‌ పాలన బాగోలేదంటూ, కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా కోరుకుంటున్నాయి. భవిష్యత్తులో మరో మూడు టర్ములు బీఆర్‌ఎస్‌ గెలుపొందడానికి కృషి జరుగుతోంది’అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘రేవంత్‌ ఒక పిల్ల కాకి. కేసీఆర్‌ కళ్లు తెరిస్తే ఆయన పని ఖతమవుతుంది’అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. 

తెలంగాణభవన్‌లో ఘనంగా వేడుకలు 
తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్య నేతలు కలసి కేసీఆర్‌ 71వ పుట్టిన రోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్‌ను కట్‌ చేశారు. కేసీఆర్‌ రాజకీయ నేపథ్యం, తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా రూపొందించిన ఫొటోలు, వీడియోను ప్రదర్శించారు.

పార్టీ నేతలు కవిత, బండ ప్రకాశ్, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, రవిచంద్ర, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, కాలేరు వెంకటేశ్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు సహా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వందల సంఖ్యలో కేసీఆర్‌ను కలసి శుభాకాంక్షలు చెప్పేందుకు ఎర్రవల్లికి బయలుదేరి వెళ్లారు. కార్యకర్తలు, అభిమానులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.  కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ శుభాకాంక్షలు మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జీవితానికి సరిపడే స్ఫూర్తిని ఇచ్చారు
‘ప్రతీ కొడుకు నాన్నే తనకు హీరో అని చెప్తాడు. కానీ మా నాన్న నాకే కాదు తెలంగాణకే హీరో. మీ పోరాటంతో సాధించిన ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో మీ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రతీక్షణం పనిచేస్తానని హామీ ఇస్తున్నా. జీవితకాలానికి సరిపడా మీరు అందించిన స్ఫూర్తికి కృతజ్ఞతలు. నాన్నా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు’. –‘ఎక్స్‌’లో కేటీఆర్‌

హ్యాపీ బర్త్‌డే డాడీ: కవిత
హ్యాపీ బర్త్‌డే డాడీ.. అంటూ కేసీఆర్‌ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను ఎమ్మెల్సీ, కేసీఆర్‌ కుమార్తె కవిత తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

కేసీఆర్‌ అంటేనే ఒక ఉద్వేగం, యుద్ధ నినాదం
‘మీరు నా తలనిమిరే తల్లిప్రేమ. నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజకీయ చైతన్యాన్ని నేరి్పంచి, నాలో ప్రజాసేవా సంస్కారాన్ని రంగరించి ఉద్యమ కార్యాచరణలో నడిపించారు. కేసీఆర్‌ అంటేనే ఒక ఉద్వేగం, ఉద్రేకం, స్వాభిమానం, యుద్ధ నినాదం, ప్రజాగళం, ఆత్మగౌరవ రణం, తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం’. –‘ఎక్స్‌’లో హరీశ్‌రావు 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)