Breaking News

మేము అండగా ఉన్నాం.. ధైర్యంగా ఉండాలి 

Published on Wed, 02/21/2024 - 04:40

మోతె: రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన గురుకుల పాఠశాలల విద్యార్థుల కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అస్మిత ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది.

విద్యార్థిని స్వగ్రామం మోతె మండలంలోని బుర్కచర్లలో కుటుంబ సభ్యులను కవిత మంగళవారం పరామర్శించారు. అస్మితకు నివాళులర్పించి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి చేతులెత్తి జోడించారు.

ప్రతి హాస్టల్‌లో సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థినుల్లో మనోధైర్యాన్ని నింపాలన్నారు. తల్లిదండ్రులు పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేయొద్దని కవిత కోరారు. ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో సీఎం చొరవ చూపి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఉన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)