Breaking News

అక్రమ వసూళ్లు..అధికార దుర్వినియోగం!

Published on Mon, 03/02/2026 - 00:57

సాక్షి, హైదరాబాద్‌:  కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, 15 రోజుల్లో ఆయనపై చర్యలు తీసుకోకపోతే సీపీ చేస్తున్న అన్ని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వీడియోలతో సహా త్వరలో అసెంబ్లీ, మీడియా సాక్షిగా బయటపెడతానని హెచ్చరించారు. ‘కరీంనగర్‌ సీపీ బచ్చాగాడు, ఆయన వయస్సు 40 యేండ్ల కంటే చిన్ననే..’అని వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు.  

ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ వాహనాలా? 
‘పీడీఎస్‌ బియ్యం అక్రమార్కుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. 337 మంది హోంగార్డుల బదిలీ కోసం రూ.కోటి తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలు ప్రైవేటు వ్యక్తుల కోసం ఉపయోగిస్తున్నారు. టీఎస్‌ 09 పీఏ 4195 ఇన్నోవా వాహనాన్ని సీపీ గౌస్‌ ఆలం తన మిత్రుడు, ఐఆర్‌ఎస్‌ అధికారి వికాస్‌ అగర్వాల్‌ తండ్రి కోసం వినియోగిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లు డ్రైవర్లుగా ఉన్నారు. టీఎస్‌ 09 పీఏ 5601 ఇన్నోవా కారు కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం సోదరుడిని కాలేజీలో డ్రాప్‌ చేసేందుకు రోజు చలిమెడ వెళ్తుంది. 

ప్రైవేటు పౌరుల కోసం ప్రభుత్వ వాహనాల వాడకంపై డీజీపీ శివధర్‌రెడ్డి సమాధానం చెప్పాలి. సీపీ సతీమణికి కరీంనగర్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఎలా వచి్చందో తెలుసు. ఆమె కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తున్నారు. ఇక ఆయన ఇంట్లో 20 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు..’అని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.  

వసూళ్ల కోసం ఏసీపీ, సీఐని పెట్టుకున్నారు.. 
‘బియ్యం అక్రమార్కుల నుంచి డబ్బులు వసూలు చేయించేందుకు ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ సృజన్‌రెడ్డిని సీపీ పెట్టుకున్నారు. జనవరి 8న ఎన్‌ఎన్‌ ప్రైడ్‌ మాల్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఆ మాల్‌ యజమాని దగ్గర నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారు. నేను చెప్పింది అబద్ధం అయితే నా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. చర్యలు తీసుకోకపోతే వీడియోలు బయట పెడతా. 

ఆ తర్వాత ఐపీఎస్‌ అధికారుల అసోసియేషన్‌ బాధపడకూడదు. ఎందుకంటే నేను ఆ వీడియోలు బయట పెడితే ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు తలదించుకునే పరిస్థితి వస్తుంది. 15 రోజుల తర్వాత హుజూరాబాద్‌ ఏసీపీ, జమ్మికుంట సీఐ ఏమేం పనులు చేస్తున్నారో అన్నీ బయట పెడతా..’అని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)