300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
కరీంనగర్‌లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి
Published on Mon, 02/23/2026 - 10:54
కరీంనగర్‌రూరల్/గోదావరిఖని: అత్తింటి వేధింపులను భరించలేక భార్య ఆత్మహత్య చేసుకోగా.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త ఆదివారం మృతిచెందాడు. వారం రోజుల వ్యవధిలో దంపతులు మరణించడం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు..
గోదావరిఖనికి చెందిన సింగరేణి ఉద్యోగి కంబాల నరేశ్(30) ఏడాదిక్రితం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపలి్లకి చెందిన లింగంపల్లి మమత(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గోదావరిఖనిలోని గంగానగర్‌లో నివాసముండగా వరకట్నం కోసం కుటుంబంలో గొడవలేర్పడ్డాయి. సోదరుడు మహేశ్‌కు చెప్పడంతో రూ.లక్ష ఇచ్చినప్పటికి మమతపై కుటుంబసభ్యుల వేధింపులు ఆగకపోవడంతో ఈ నెల 15న నస్పూర్‌కాలనీలోని బంధువుల ఇంటికి మమత వెళ్లింది. మరుసటిరోజు ఇంటి యజమాని ఫోన్ చేసి నరేశ్ మెట్లమీదనుంచి కిందపడిపోయి ఆపస్మారకస్థితిలో ఉన్నాడని చెప్పడంతో మమత గోదావరిఖనికి వచ్చింది. సింగరేణి ఆస్పత్రిలో చేర్పించగా నరేశ్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 17న ఆస్పత్రిలో ఉన్న మమతను అత్తింటివాళ్లు దూషించడంతో మనస్తాపానికి గురై తీగలగుట్టపలి్లలోని రైల్వేట్రాక్ వద్ద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. మమత తండ్రి పోషం ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు. ఆదివారం వేకువజామున 4గంటలకు చికిత్స పొందుతూ భర్త నరేశ్ మృతిచెందాడు. దంపతులకు గోదావరిఖనిలో గొడవలు కావడంతోపాటు నరేశ్ శరీరంపై గాయాలుండటంతో తదుపరి విచారణ నిమిత్తం మృతదేహాన్ని గోదావరిఖనికి పంపించినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నరేశ్ మృతిపై తండ్రి కంబాల భూమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో గోదావరిఖని వన్‌టౌన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేశారు.
Tags : 1