Breaking News

అంబానీల అతిథులకు కరీంనగర్‌ కానుకలు

Published on Thu, 05/23/2024 - 10:00

విద్యానగర్‌ (కరీంనగర్‌): ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్‌ ఫిలిగ్రీ కళానైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఆర్థిక కుబేరుడు ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌–రాధిక వివాహ వేడుకలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్దస్టార్స్‌ కూడా హాజరుకానున్నారు. ఈ పెళ్లికి హాజరయ్యే వీవీఐపీలకు విలువైన బహుమతులను ఇచ్చేందుకు అంబానీ కుటుంబం నిర్ణయించింది. వాటిలో కరీంనగర్‌ వెండి ఫిలిగ్రీ కూడా ఉన్నాయి. 

ఈ విలువైన ఫిలిగ్రీ గిఫ్ట్స్‌ డెలివరీ కోసం దాదాపు 400 రకాల వస్తువుల ఆర్డర్స్‌ వచి్చనట్లు కరీంనగర్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు అర్రోజు అశోక్‌ తెలిపారు. ఇందులో నగల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతర త్రా వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం 400 సంవత్సరాల నాటి పురాతన కళకు ప్రోత్సాహకంగా నిలు స్తుందని వారు పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళకు 2007లో జీఐ ట్యాగ్‌ లభించింది. స్వచ్ఛమైన వెండిని కరిగించి.. అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయా రు చేయడం, తీగలు అల్లడం ఈ కళ విశేషం.  

ఆర్డర్‌ ఇచ్చిన కుబేరుల కుటుంబం

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)